Machine Pistol: దేశీయంగా తయారైన మొట్టమొదటి మెషీన్ పిస్టల్ ఇదిగో!

First machine pistol in India

  • భారత బలగాలకు త్వరలోనే మెషీన్ పిస్టల్
  • సైన్యం సహకారంతో అభివృద్ధి చేసిన డీఆర్డీఓ
  • 'అస్మి'గా నామకరణం
  • దీని పరిధి 100 మీటర్ల రేంజి

మనకు మెషీన్ గన్ ల గురించి తెలిసిందే. సెకన్ల వ్యవధిలో  గుళ్ల వర్షం కురిపిస్తాయి. ఇప్పుడు మెషీన్ పిస్టల్ కూడా వచ్చేసింది. అది కూడా పూర్తిగా దేశీయంగా తయారైన మెషీన్ పిస్టల్ ఇది. దీన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ), భారత సైన్యం సంయుక్తంగా అభివృద్ధి చేయగా...  ఇన్ఫాంట్రీ స్కూల్, ఆయుధ పరిశోధన అభివృద్ధి సంస్థ (ఏఆర్డీఈ) తుపాకీ తయారీలో పాలుపంచుకున్నాయి. దేశంలో పలు పరిస్థితుల్లో రక్షణ అవసరాల నిమిత్తం ఈ మెషీన్ పిస్టల్ ఉపయుక్తంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

త్వరలోనే ఈ అత్యాధునిక తుపాకీ బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్ బీ వంటి పారామిలిటరీ దళాలకు అందనుంది. ఈ మెషీన్ పిస్టల్ రేంజి 100 మీటర్లు, దీని ఉత్పత్తి వ్యయం రూ.50 వేల లోపే ఉంటుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. దీన్ని విమానంలో ఉపయోగించే అల్యూమినియం, కార్బన్ ఫైబర్ తో తయారుచేశారు. ఇందులోని పలు భాగాలను త్రీడీ ప్రింటింగ్ సాయంతో రూపొందించడం విశేషం. దీనికి అస్మి అని నామకరణం చేశారు. అస్మి అంటే ఆత్మాభిమానం, గర్వకారణం, స్వయం కృషి అని అర్థం.

Machine Pistol
India
DRDO
Army
  • Loading...

More Telugu News