మహాత్మాగాంధీ వారసుడు మన ముఖ్యమంత్రి జగనా?... విడ్డూరంగా లేదూ, అజేయ కల్లం గారూ!: వర్ల రామయ్య

14-01-2021 Thu 15:54
  • గాంధీజీ కలలు జగన్ నెరవేరుస్తారా? అంటూ వ్యాఖ్యలు
  • ఆత్మాభిమానాన్ని ఇంతగా తాకట్టు పెట్టాలా? అంటూ ట్వీట్
  • ఐఏఎస్ అధికారిగా ప్రజాసేవ చేసింది మీరేనా? అంటూ విస్మయం
  • ఏంటండీ మీరు మరీనూ! అంటూ ఎద్దేవా 
Varla Ramaiah take dig at Ajeya Kallam

మహాత్మాగాంధీ కలలుగన్న ప్రజాసంక్షేమాన్ని నెరవేర్చేది సీఎం జగనే అంటూ ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం వ్యాఖ్యానించారంటూ టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శనాస్త్రాలు సంధించారు. నాలుగు రూపాయల నెల జీతం, చిన్న హోదా కోసం ఆత్మాభిమానాన్ని ఇంతగా తాకట్టుపెట్టుకోవాలా అని వ్యాఖ్యానించారు.

ఐఏఎస్ అధికారిగా ఇంతకాలం ప్రజాసేవ చేసింది మీరేనా..? అంటూ సందేహం వ్యక్తం చేశారు. "ఏంటండీ  మీరు మరీనూ!... మహాత్మాగాంధీ వారసుడు ముఖ్యమంత్రి జగనా..? గాంధీజీ కలలు నెరవేర్చేది మన ముఖ్యమంత్రి గారా..? విడ్డూరంగా లేదూ! హవ్వా!" అంటూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు.