Polio Vaccination: ముందు కరోనా వ్యాక్సినేషన్... పోలియో టీకాల కార్యక్రమం వాయిదా

  • ఈ నెల 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్
  • జనవరి 19న జరగాల్సిన పల్స్ పోలియో
  • ఈ నెల 31కి వాయిదా
  • కరోనా వ్యాక్సిన్ పంపిణీ తొలి దశ ముగిసిన తర్వాతే పోలియో టీకాలు
Polio immunisation postponed due to Corona vaccination

దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 16 నుంచి భారత్ లో దశల వారీగా కరోనా వ్యాక్సినేషన్ అమలు చేయనున్నారు. కాగా, ఈ నెల 19న దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించాలని కేంద్రం భావించినా, కరోనా వ్యాక్సిన్ పంపిణీ కారణంగా ఆ కార్యక్రమం వాయిదా పడింది.

కరోనా తొలి దశ వ్యాక్సినేషన్ ముగిసిన తర్వాత జనవరి 31న పోలియో టీకాల కార్యక్రమం ఉంటుందని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈ నెల 30న ప్రారంభించనున్నారు. దేశంలో కొవిడ్ టీకా అందించాల్సి రావడం అత్యవసర విషయం కావడంతో ఆ కార్యక్రమానికి అడ్డంకులు ఏర్పడకుండా ఉండేందుకు పోలియో టీకాల కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాయిదా వేసింది.

More Telugu News