WHO: కరోనా మూలాల అన్వేషణకు వుహాన్ వచ్చిన డబ్ల్యూహెచ్ఓ నిపుణులకు క్వారంటైన్

  • కరోనా వైరస్ జన్మస్థానంగా వుహాన్ కు గుర్తింపు
  • వుహాన్ కు పీటర్ బెన్ ఎంబారెక్ నేతృత్వంలో బృందం 
  • చైనాలో మళ్లీ వైరస్ వ్యాప్తి
  • 14 రోజులు క్వారంటైన్ లో ఉండనున్న డబ్ల్యూహెచ్ఓ బృందం
Quarantine for WHO experts team in Wuhan

గత ఏడాది కాలంగా ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ పుట్టుక గుట్టుమట్లు తెలుసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిద్ధమైంది. ఈ క్రమంలో చైనాలోని వుహాన్ నగరానికి డబ్ల్యూహెచ్ఓ నిపుణుల బృందం విచ్చేసింది. అయితే వుహాన్ లో మళ్లీ కరోనా వ్యాప్తి అధికం కావడంతో బయటి వ్యక్తులకు క్వారంటైన్ నిబంధనలు అమలు చేస్తున్నారు.

పీటర్ బెన్ ఎంబారెక్ నేతృత్వంలో వచ్చిన డబ్ల్యూహెచ్ఓ నిపుణుల బృందం కూడా తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండనుంది. క్వారంటైన్ పూర్తయిన పిమ్మట వుహాన్ లో ఈ బృందం తమ పరిశోధనలు ప్రారంభించనుంది. కరోనా వైరస్ ఎలా ఉద్భవించింది? అందుకు గల కారణాలు ఏంటి? ఎలా వ్యాప్తి చెందింది? అనే అంశాలను డబ్ల్యూహెచ్ఓ నిపుణులు వెలుగులోకి తీసుకురానున్నారు.

More Telugu News