రైతు బాగుపడితే మీకు అంత కడుపుమంట ఎందుకు?: విజ‌య‌సాయిరెడ్డి

14-01-2021 Thu 13:30
  • అమూల్ రాకతో వరి పండించే రైతుల‌కు లాభం
  • పాడి రైతుల‌కూ  అదనపు ఆదాయం
  • హెరిటేజ్ కంపెనీ ఆదాయం తగ్గింది
  • అయితే, లక్షలాది రైతులకు లాభం జరిగిందిగా?
vijaya sai slams chandrababu

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు చేస్తోన్న విమ‌ర్శ‌ల ప‌ట్ల వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన‌ జీవోలను భోగి మంటల్లో వేయమంటున్నార‌ని మండిప‌డ్డారు.

'అమూల్ రాకతో వరి పండించే రైతులే కాదు పాడి రైతులు కూడా అదనపు ఆదాయంతో ఆనందంగా ఉన్నారు. మరి రాష్ట్రం ఇచ్చిన జీవోలను భోగి మంటల్లో వేయమంటారేంటి చంద్రబాబు గారూ? హెరిటేజ్ కంపెనీ ఆదాయం తగ్గినా లక్షలాది రైతులకు లాభం జరిగిందిగా? రైతు బాగుపడితే మీకు అంత కడుపుమంట ఎందుకు?' అని విజ‌య‌సాయిరెడ్డి విమర్శ‌లు గుప్పించారు.