temple: గుంటూరులో ఆల‌య తాళాలు ప‌గులకొట్టి.. అమ్మ‌వార్ల తాళిబొట్టు, ముక్కుపుడక‌ల చోరీ

  • ఈపూరు మండలంలోని ముప్పాళ్ల గ్రామంలో ఘ‌ట‌న‌
  • శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో క‌ల‌క‌లం
  • గుర్తించిన పోలీసుల‌కు పూజారి ఫిర్యాదు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో దేవాల‌యాల‌పై దాడులు క‌ల‌క‌లం రేపుతోన్న వేళ తాజాగా ఓ దేవాల‌యంలో చోరీ ఘ‌ట‌న అల‌జ‌డి రేపింది. ఓ దేవాల‌యంలోకి దుండ‌గులు తాళాలు ప‌గుల‌గొట్టి వెళ్లారు. గుంటూరు జిల్లా ఈపూరు మండలంలోని ముప్పాళ్ల గ్రామంలో ఈ ఘ‌టన చోటు చేసుకుంది.

ఊళ్లోని శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో గ‌త రాత్రి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. అనంత‌రం గుడికి తాళాలు వేసి వెళ్లారు. ఆ త‌ర్వాత కొంద‌రు ఆల‌య‌ గేట్లు, తలుపులకు ఉన్న తాళాలను పగులగొట్టి లోపలికి చొర‌బ‌డ్డారు. ఆల‌యంలోని భద్రకాళి, భ్రమరాంబికాదేవి మెడలో ఉన్న తాళి బొట్లతో పాటు ముక్కు పుడకలను కూడా చోరీ చేశారు. ఈ రోజు ఉద‌యం గుడి తెర‌వ‌డానికి వ‌చ్చిన పూజారి ఈ విష‌యాన్ని గ్రామ‌స్థుల‌కు తెలిపాడు. అనంత‌రం వారు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు.

More Telugu News