శివాని రాజశేఖర్ సినిమా ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ టీజ‌ర్ విడుద‌ల‌

14-01-2021 Thu 11:44
  • మ‌హేశ్ బాబు చేతుల మీదుగా విడుద‌ల‌
  • 118 సినిమా విజ‌యవంత‌మైన  తర్వాత గుహన్‌ దర్శకత్వంలో సినిమా
  • చాలా డిఫ‌రెంట్ గా టీజ‌ర్
www teaser releases

అదిత్‌ అరుణ్‌, శివాని రాజశేఖర్ నటిస్తున్న ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ: హూ వేర్‌ వై’ సినిమా టీజ‌ర్ ను హీరో మ‌హేశ్ బాబు ఈ రోజు సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. 118 సినిమా విజ‌యవంత‌మైన  తర్వాత గుహన్‌ దర్శకత్వంలో వస్తోన్న మరో ప్ర‌యోగాత్మ‌క ‌ థ్రిల్లర్ సినిమా కావ‌డంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి.

జీవితంలో ఎదురైన ప్రశ్నలకు జ‌వాబుల‌ను వెతుకుతూ వెళ్లే ఓ జంట సాగించే ప్రయాణం క‌థ‌గా ఈ సినిమాను తీస్తున్నారు. ఇటీవ‌లే ఈ సినిమా టైటిల్‌ లోగోను విడుదల చేశారు. టీజ‌ర్ కూడా చాలా డిఫ‌రెంట్ గా ఉంది. ఈ సినిమాకు సంగీతాన్ని సైమన్‌ కె కింగ్ అందిస్తుండ‌గా, సంభాషణలను మిర్చి కిరణ్ రాశారు.