Earth Quake: నిన్న హైదరాబాద్, నేడు ప్రకాశం జిల్లాలో... భయపెడుతున్న భూ ప్రకంపనలు!

Earth Quake in Prakasam Dist

  • నిన్న కూకట్ పల్లిలో ప్రకంపనలు
  • అర్థరాత్రి బల్లికురవ మండలంలో ప్రకంపనలు
  • వీధుల్లో జాగారం చేసిన ప్రజలు

తెలుగు రాష్ట్రాల ప్రజలను భూ ప్రకంపనలు వణికిస్తున్నాయి. నిన్న హైదరాబాద్ పరిధిలోని కూకట్ పల్లి, బోరబండ తదితర ప్రాంతాల్లో స్వల్ప భూకంపం రాగా, నేడు ప్రకాశం జిల్లాలో భూమి కంపించింది. బల్లికురవ ప్రాంతంలో అర్థరాత్రి 1.25 గంటల సమయంలో దాదాపు రెండు సెకన్ల పాటు భూమి కంపించిందని, దీని తీవ్రత స్వల్పంగానే ఉందని అధికారులు తెలిపారు. కాగా, భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదైంది. ప్రకంపనలకు భయపడిన ప్రజలు, వీధుల్లోకి వచ్చి రాత్రంతా జాగారం చేస్తూ గడిపారు. ప్రకంపనల కారణంగా ఎటువంటి నష్టమూ జరగలేదని సమాచారం.

Earth Quake
Prakasam District
Hyderabad
Ballikurava
  • Loading...

More Telugu News