రూ. 444 ప్లాన్ ను లాంచ్ చేసిన జియో.. ప్లాన్ వివరాలు ఇవిగో!

13-01-2021 Wed 20:23
  • 56 రోజుల వాలిడిటీ
  • రోజుకు 2 జీబీ డేటా
  • అన్ని జియో యాప్ లు ఉచితం
Jio launches Rs 444 plan

తన వినియోగదారుల కోసం ఇప్పటికే ఎన్నో ప్లాన్లను తీసుకొచ్చిన రియలన్స్ జియో ... తాజాగా మరో ప్లాన్ ను లాంచ్ చేసింది. రూ. 444 ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇతర టెలికాం కంపెనీలు అందిస్తున్న ప్లాన్లతో పోలిస్తే ఇది చాలా బెటర్ అని జియో చెబుతోంది. ఈ ప్లాన్ స్పెషాలిటీస్ ఏమిటో చూద్దాం.

  • ప్లాన్ విలువ రూ. 444
  • 56 రోజుల వాలిడిటీ
  • రోజుకు 2 జీబీ డేటా
  • 56 రోజులకు గాను 112 జీబీని వినియోగదారులు వినియోగించవచ్చు
  • డేటా మొత్తం అయిపోయిన వెంటనే 64 కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ ను వినియోగదారులు వాడుకోవచ్చు
  • అన్ని నెట్ వర్క్ లకు అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్
  • అన్ని జియో యాప్ లను ఉచితంగా వినియోగించవచ్చు.
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి ఈ ప్లాన్ ఉపయుక్తంగా ఉంటుందని జియో చెబుతోంది.