చార్మినార్ భాగ్యల‌క్ష్మి ఆలయంలో క‌ల్వ‌కుంట్ల క‌విత పూజ‌లు.. వీడియో ఇదిగో

13-01-2021 Wed 13:14
  • భోగి సంద‌ర్భంగా ఆల‌య సంద‌ర్శ‌న‌
  • ప్ర‌త్యేక పూజ‌ల్లో పాల్గొన్న క‌విత
  • తెలంగాణ వ్యాప్తంగా జాగృతి ఆధ్వర్యంలో ‌ భోగి మంటల వేడుక
kavita offers prayers at bagyalakshmi temple

హైదరాబాద్, పాతబస్తీలో చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆల‌యంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్ర‌త్యేక పూజ‌ల్లో పాల్గొన్నారు. భోగి సంద‌ర్భంగా ఆమె ఆ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్నారు. కొత్త ఏడాదిలో ప్రజలంతా సుఖ, సంతోషాలతో ఉండాలని పూజ‌లు చేసిన‌ట్లు తెలిపారు.

అంత‌కు ముందు తెలంగాణ వ్యాప్తంగా జాగృతి ఆధ్వర్యంలో నిర్వ‌హించిన‌ భోగి మంటల వేడుక‌లోనూ ఆమె పాల్గొన్నారు. 2020లో కరోనాతో ఇబ్బందులు పడ్డామని, ఆ చెడు అంతా ఈ భోగి మంటల్లో కాలిపోవాలని అన్నారు. ప్రజలంతా కొవిడ్-19 నుంచి విముక్తి పొందాలని ఆకాంక్షిస్తున్న‌ట్లు తెలిపారు. గత ఏడాది దీపావళి పర్వదినం సంద‌ర్భంగా కూడా ఆమె భాగ్య‌ల‌క్ష్మి ఆల‌యాన్ని సంద‌ర్శించారు.