అసెంబ్లీ ఎన్నికల్లో మాకు మద్దతు ఇవ్వండి.. రజనీకాంత్‌ను కోరిన బీజేపీ నాయకురాలు, సినీ నటి గౌతమి

13-01-2021 Wed 10:20
  • మద్దతు విషయంలో రజనీకాంత్ పునరాలోచించాలి
  • తమిళనాడులో బీజేపీ బలోపేతం అవుతోంది
  • నేను పోటీ చేసే విషయంలో క్లారిటీ లేదు
BJP leader Gauthami urges Rajanikanth to support BJP

రాజకీయాల్లోకి రాబోనంటూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల స్పష్టం చేసిన నేపథ్యంలో సినీనటి, బీజేపీ రాజపాళ్యం నియోజకవర్గ బాధ్యురాలు గౌతమి కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని రజనీకాంత్‌ను కోరారు. ఈ విషయంలో ఆయన మరోమారు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

విరుదునగర్ దక్షిణ జిల్లా నేతలు శ్రీవిల్లిపుత్తూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గౌతమి నిన్న పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అవుతోందని అన్నారు. రానున్న ఎన్నికల్లో రాజపాళ్యం నుంచి తాను పోటీ చేసే విషయంలో స్పష్టత లేదన్నారు. అనంతరం పెద్ద మారియమ్మన్‌ ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ముగ్గులపోటీ విజేతలకు బహుమతులు అందజేశారు.