సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

13-01-2021 Wed 07:21
  • మహేశ్ సినిమా కోసం బరువు పెరిగిన కీర్తి 
  • మణిరత్నం సినిమాకు నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్
  • 15న థియేటర్లకు వస్తున్న పునర్నవి 'సైకిల్'    
Keerti Suresh put on weight for Mahesh movie

*  మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమాలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల బాగా సన్నబడిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడీ చిత్రం కోసం దర్శకుడి సూచనలపై కాస్త బరువు పెరిగినట్టు తెలుస్తోంది. ఈ నెల 26 నుంచి ఈ చిత్రం షూటింగును దుబాయ్ లో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.
*  ప్రముఖ దర్శకుడు మణిరత్నం కలల ప్రాజక్టుగా తెరకెక్కుతున్న 'పొన్నియన్ సెల్వన్' చిత్రానికి నెట్ ఫ్లిక్స్ నుంచి భారీ అఫర్ వచ్చిందట. అయితే, ఇలాంటి చారిత్రాత్మక చిత్రాన్ని థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల చేయడానికి మణిరత్నం అంగీకరిస్తాడా? అన్నది త్వరలో తెలుస్తుంది.
*  బిగ్ బాస్, ఉయ్యాల జంపాల ఫేమ్ పునర్నవి కథానాయికగా నటించిన 'సైకిల్' చిత్రం ఈ నెల 15న తెలుగు రాష్ట్రాలలో విడుదలవుతోంది. అర్జున్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహత్ రాఘవేంద్ర, పునర్నవి జంటగా నటించారు.