రామ్ చరణ్ కు కరోనా నెగెటివ్

12-01-2021 Tue 16:44
  • కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు డిసెంబర్ 28న ప్రకటించిన చరణ్
  • తాజా టెస్టులో నెగెటివ్ అని తేలిందని ప్రకటన
  • త్వరలోనే షూటింగ్ లో పాల్గొంటానని వ్యాఖ్య
Ramcharan tested Negative

మెగా ఫ్యాన్స్ కి రామ్ చరణ్ గుడ్ న్యూస్ చెప్పాడు. తనకు కరోనా టెస్టులో నెగెటివ్ అని తేలిందని వెల్లడించాడు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తన ఆరోగ్య పరిస్థితిని వివరించాడు. 'నాకు కరోనా టెస్టులో నెగెటివ్ వచ్చిందని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నా. త్వరలోనే మళ్లీ షూటింగుల్లో పాల్గొంటాను. మీ అందరి విషెస్ కు థ్యాంక్స్' అని ట్వీట్ చేశాడు.

తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందంటూ డిసెంబర్ 28న చరణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ వచ్చిందని.... అయితే లక్షణాలు మాత్రం కనిపించడం లేదని అప్పుడు చరణ్ తెలిపాడు. హోమ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నానని చెప్పాడు. దీంతో మెగా అభిమానులు కలవరపాటుకు గురయ్యారు. ఇప్పుడు పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.