సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

12-01-2021 Tue 07:22
  • సునీల్ సరసన నాయికగా అనసూయ 
  • వేసవి నుంచి ప్రభాస్ కొత్త సినిమా  
  • త్రివిక్రమ్ తో సినిమా గురించి రామ్ 
  • 'డ్రైవర్ జమున'గా ఐశ్వర్య రాజేశ్  
Anasuya opposite comedian Sunil

*  ప్రముఖ నటి, యాంకర్ అనసూయ త్వరలో హాస్యనటుడు సునీల్ సరసన కథానాయికగా నటించనుంది. సునీల్ హీరోగా రూపొందే 'వేదాంతం రాఘవయ్య'  సినిమాలో కథానాయికగా నటించడానికి అనసూయ అంగీకరించినట్టు తాజా సమాచారం.
*  ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందే పాన్ ఇండియా చిత్రం కోసం భారీ సెట్స్ వేస్తున్నారు. ఈ చిత్రం షూటింగును ఈ వేసవిలో ప్రారంభిస్తారు. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపిక పదుకొనె కథానాయికగా నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను పోషిస్తున్నారు.
*  తాజాగా 'రెడ్' సినిమాలో నటించిన ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రానుందంటూ ఇటీవల వార్తలొచ్చాయి. ఇదే విషయమై హీరో రామ్ తాజాగా స్పందిస్తూ, ప్రస్తుతం ఈ చిత్రం చర్చల దశలోనే ఉందనీ, ఇంకా పూర్తి క్లారిటీ రాలేదనీ చెప్పాడు.
*  ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా వున్న ఐశ్వర్య రాజేశ్ మరో తమిళ చిత్రాన్ని అంగీకరించింది. ఈ చిత్రం పేరు 'డ్రైవర్ జమున'. త్వరలో షూటింగును ప్రారంభించుకునే ఈ చిత్రానికి కిన్లిన్ దర్శకత్వం వహిస్తాడు.