వరుణ్ తేజ్ తో పవన్ నిర్మించే సినిమా

11-01-2021 Mon 21:41
  • రేపటి నుంచి క్రిష్ సినిమా షూటింగులో పవన్ 
  • సొంత బ్యానర్ పై పవన్ చిత్ర నిర్మాణం
  • వరుణ్ తేజ్ హీరోగా డాలీ దర్శకత్వంలో సినిమా
Pawan Kalyan to produce a film with Varun Tej

ఇప్పటికే 'వకీల్ సాబ్' చిత్రాన్ని పూర్తిచేసిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రేపటి నుంచి క్రిష్ దర్శకత్వంలో రూపొందే సినిమా షూటింగులో జాయిన్ అవుతున్నారు. ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. అలాగే మరోపక్క, 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ తో పాటు హరీశ్ శంకర్ దర్శకత్వంలో కూడా పవన్ ఓ సినిమా చేయనున్నారు.

ఇదిలావుంచితే, పవన్ మరోపక్క నిర్మాతగా కూడా ఇప్పుడు బిజీ అవనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వరుణ్ తేజ్ హీరోగా ఆయన ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి కిశోర్ కుమార్ పార్థసాని (డాలీ) దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా రెడీ అయిందనీ, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయనీ చెబుతున్నారు. గతంలో పవన్ నటించిన 'గోపాల గోపాల' చిత్రానికి డాలీ దర్శకత్వం వహించిన సంగతి విదితమే.