Parliament: కేంద్రం కీలక నిర్ణయం.. ఈసారి పేపర్ లెస్ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు!

This union budget sessions going to be paperless
  • బడ్జెట్ ప్రతులను ముద్రించకూడదని కేంద్రం నిర్ణయం
  • కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటన
  • జనవరి 29న ప్రారంభంకానున్న బడ్జెట్ సమావేశాలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమవుతోంది. అయితే, ఈసారి బడ్జెట్ సమావేశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ ప్రతులను ముద్రించకూడదని నిర్ణయించింది. పేపర్ లెస్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించబోతోంది. దీనికి ఇప్పటికే పార్లమెంటు ఉభయ సభల ఆమోదం లభించింది. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది. బడ్జెట్ ప్రతులను ముద్రించేందుకు 100కు పైగా వ్యక్తులను 15 రోజుల పాటు ప్రింటింగ్ ప్రెస్ లో ఉంచలేమని ఆర్థికశాఖ వెల్లడించింది. 1947 తర్వాత మరోసారి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి.

ఈ బడ్జెట్ సమావేశాలు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు రెండు విడతల్లో జరగనున్నాయి. తొలి విడతలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు... రెండో విడతలో మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. జనవరి 29న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు.
Parliament
Budget Session
Paperless

More Telugu News