మరో సినిమాకి అనుష్క గ్రీన్ సిగ్నల్?

11-01-2021 Mon 14:40
  • ఇటీవలి కాలంలో వెనుకపడిన అనుష్క 
  • నిరాశపరిచిన తాజా చిత్రం 'నిశ్శబ్దం'
  • 'రారా కృష్ణయ్య' ఫేమ్ మహేశ్ తో సినిమా  
Anushka Shetty gives nod for another film

ఒకప్పుడు కథానాయికగా అగ్ర కథానాయకులందరితో కలసి నటించి.. అగ్రతారగా రాణించిన అనుష్క ఇటీవలి కాలంలో వెనుకపడిపోయింది. కొత్త కథానాయికల తాకిడితో ఆమె ప్రాభవం తగ్గిపోయింది. ఆమధ్య ఆమె నటించిన 'నిశ్శబ్దం' చిత్రం ఇటీవల ఓటీటీ ద్వారా విడుదలైనప్పటికీ, ప్రేక్షకాదరణ మాత్రం పొందలేకపోయింది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ ఇక సినిమాలకు స్వస్తి చెప్పి, పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలై పోతుందంటూ వార్తలు కూడా వచ్చాయి.

ఈ నేపథ్యంలో, అనుష్క తాజాగా ఓ తెలుగు సినిమాకి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో 'రారా కృష్ణయ్య' చిత్రాన్ని రూపొందించిన పి.మహేశ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మహేశ్ చెప్పిన కథ నచ్చడంతో, ఆమె ఈ ప్రాజక్టుకి ఓకే చెప్పిందని అంటున్నారు. ఈ ప్రాజక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడవచ్చని అంటున్నారు.