Maharashtra: మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ కలకలం... ఫౌల్ట్రీఫామ్‌లలో 800 కోళ్లు మృతి
- పర్బణీ జిల్లాలోని మురుంబా గ్రామంలో ఘటన
- కోళ్ల నమూనాలను ల్యాబ్‌కు పంపిన అధికారులు
- కోళ్ల మృతికి బర్డ్ ఫ్లూ కారణమని నిర్ధారణ
దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో కోళ్లు మృతి చెందుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే యూపీ, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, గుజరాత్‌లలో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా, మహారాష్ట్రలోని పర్బణీ జిల్లాలోని మురుంబా గ్రామంలో రెండు రోజుల్లో సుమారు 800 కోళ్లు మృతి చెందాయి. ఈ నేపథ్యంలో కోళ్ల నమూనాలను అధికారులు ల్యాబ్‌కు పంపించారు. దీంతో ఈ కోళ్ల మృతికి బర్డ్ ఫ్లూ కారణమని తెలిసిందని అధికారులు ప్రకటించారు. మురుంబా గ్రామంలోని ఎనిమిది ఫౌల్ట్రీఫామ్‌లలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. దీతో మిగిలిన కోళ్లన్నింటిని చంపేయనున్నట్లు అధికారులు తెలిపారు.