సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

11-01-2021 Mon 07:27
  • 'గుర్తుందా శీతాకాలం' సెట్స్ లో తమన్నా 
  • చిరంజీవి 'ఆచార్య' విడుదల తేదీ ఖరారు 
  • వచ్చే నెల నుంచి తేజ, గోపీచంద్ సినిమా  
Thamanna joins Gurtunda Sheetakalam movie shoot

*  తమన్నా, సత్యదేవ్ జంటగా నటిస్తున్న 'గుర్తుందా శీతాకాలం' చిత్రం షూటింగ్ ప్రస్తుతం బెంగళూరులో జరుగుతోంది. నిన్నటి నుంచి కథానాయిక తమన్నా కూడా ఈ సినిమా షూటింగులో పాల్గొంటోంది. కన్నడలో వచ్చిన 'లవ్ మాక్ టైల్' సినిమా ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి నాగశేఖర్ దర్శకత్వం వహిస్తుంన్నాడు.
*  చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' చిత్రం షూటింగ్ ఫిబ్రవరి నెలాఖరుకి పూర్తవుతుంది. కాగా, చిత్రాన్ని మీ 9న రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో చిరంజీవి నటించిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' చిత్రం విడుదలైన ఆ తేదీని మెగాస్టార్ నిర్మాతలు సెంటిమెంటుగా భావిస్తారు.
*  ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందే 'అలిమేలుమంగ వెంకటరమణ' చిత్రం షూటింగు వచ్చే నెలలో మొదలవుతుంది. ఇందులో కథానాయికగా ఎవరు నటిస్తారన్నది ఇంకా ఖరారు కాలేదు. తాప్సి, కీర్తి సురేశ్ పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి.
*  బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన 'అల్లుడు అదుర్స్' సినిమా ఒకరోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మొదట్లో ఈ చిత్రాన్ని ఈ నెల 15న రిలీజ్ చేయాలని నిర్ణయించినప్పటికీ, ఒకరోజు ముందుగా అంటే 14నే విడుదల చేయాలని నిర్మాతలు తాజాగా నిర్ణయించారు.