Boney Kapoor: నటుడిగా మారిన బోనీ కపూర్... రణబీర్ కపూర్ చిత్రంలో తండ్రి పాత్ర

Producer Boney Kapoor acts in a bollywood film

  • చిత్ర నిర్మాతగా ప్రసిద్ధికెక్కిన బోనీ
  • అనేక హిట్ చిత్రాల నిర్మాణం
  • లవ్ రంజన్ దర్శకత్వంలో నటుడిగా కొత్త ఇన్నింగ్స్
  • త్వరలో షూటింగ్ లో పాల్గొననున్న బోనీ

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. చిత్రనిర్మాణంలో  కాకలు తీరిన బోనీ కపూర్ ఇప్పుడు నటుడిగా కెమెరా ముందుకు రానున్నారు. లవ్ రంజన్ దర్శకత్వంలో రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న చిత్రంలో బోనీ కపూర్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఆయన ఈ చిత్రంలో హీరో రణబీర్ కపూర్ కు  తండ్రిగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది. హీరోహీరోయిన్లు రణబీర్, శ్రద్ధాలపై పలు సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే బోనీ కపూర్ కూడా షూటింగ్ కు హాజరవనున్నారు.

65 ఏళ్ల బోనీ కపూర్ నిర్మాతగా అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు. ఇటీవల ఆయన ప్రాంతీయ భాషల చిత్రాలపైనా దృష్టిసారించారు. 2019లో నెర్కొండ పార్వై (తమిళం) చిత్రాన్ని నిర్మించిన బోనీ... ఈ ఏడాది వాలిమై (2021), వకీల్ సాబ్ (2021) చిత్రాల నిర్మాణంలోనూ భాగం పంచుకుంటున్నారు.

Boney Kapoor
Acting
Father Role
Ranbir Kapoor
Bollywood
  • Loading...

More Telugu News