ఏంరా వ‌దిలేస్తావా న‌న్నూ? అంటోన్న సాయిప‌ల్ల‌వి.. ‘లవ్‌ స్టోరి’ టీజ‌ర్ విడుద‌ల‌

10-01-2021 Sun 10:41
  • శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో సినిమా
  • నాగచైతన్య, సాయి పల్లవి జంటగా మూవీ
  • అల‌రిస్తోన్న టీజ‌ర్
Heres Lovestoryteaser for you all

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రూపుదిద్దుకుంటోన్న సినిమా ‘లవ్‌ స్టోరి’. ఈ సినిమా నుంచి టీజ‌ర్ ను ఈ రోజు ఉద‌యం 10:08 గంటలకు విడుదల చేశారు. ఏంరా వ‌దిలేస్తావా న‌న్నూ? అంటూ సాయి ప‌ల్ల‌వి చెబుతోన్న డైలాగు అల‌రిస్తోంది.
 
సాయి ప‌ల్ల‌వి హీరోయిన్ గా గ‌తంలో ఫిదా సినిమా తీసి సూప‌ర్ హిట్ కొట్టిన శేఖర్‌ కమ్ముల రూపొందించిన ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే ‘ఏయ్‌ పిల్లా’  అనే పాట విడుద‌లైంది. ఈ పాట‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది.  ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకు పవన్ సీహెచ్ సంగీతం అందించారు.