Vijay: భారీ అంచనాలతో పండగకు థియేటర్లకు వస్తున్న విజయ్ 'మాస్టర్'

  • లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ 'మాస్టర్'
  • సంక్రాంతి సందర్భంగా ఈ నెల 13న విడుదల  
  • తెలుగు రాష్ట్రాలలో 400 థియేటర్లలో రిలీజ్
  • 200 కోట్ల బిజినెస్.. నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్స్  
Vijays Master releasing for Pongal

తమిళనాట రజనీకాంత్ తర్వాత సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న హీరో విజయ్ నటించిన సినిమా రిలీజ్ అవుతోందంటే అభిమానులకు ఒక పండగ లాంటిందే. అందులోనూ పండగ రోజున ఆ సినిమా రిలీజ్ అయితే ఇక పెద్ద పండగే! అలాంటి సందర్భమే ఇప్పుడు చోటుచేసుకుంటోంది. విజయ్ నటించిన తాజా చిత్రం 'మాస్టర్'ను  భారీ అంచనాల నడుమ ఈ నెల 13న సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు.

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మరో ప్రముఖ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటించడం ఓ విశేషం. వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావలసి ఉన్నప్పటికీ, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక రేపటి సంక్రాంతికి దక్షిణాదిన విడుదలవుతున్న అతి పెద్ద భారీ చిత్రం ఇదే అని చెప్పాలి. 200 కోట్ల వరకు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి, నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టిందని బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక విడుదల పరంగానూ ఈ సినిమా రికార్డు కొడుతోందని చెప్పచ్చు. తమిళనాడులో 700 థియేటర్లలో దీనిని రిలీజ్ చేస్తున్నారు. అలాగే, రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కలిపి 400 థియేటర్లు, కేరళలో 200 థియేటర్లు, కర్ణాటకలో 100 థియేటర్లు, ఉత్తరాదిన (హిందీ వెర్షన్) 1000, విదేశాలలో 1000 థియేటర్లలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

మొత్తానికి పండగ దినాలను సొమ్ము చేసుకోవాలని నిర్మాతలు విడుదల ఏర్పాట్లను ముమ్మరంగానే చేస్తున్నారు. మరి, సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటోంది చూడాలి!

More Telugu News