దర్శకత్వం చేపట్టే అవకాశాలు ఉన్నాయి: రవితేజ

08-01-2021 Fri 15:28
  • తొలుత దర్శకత్వ శాఖలో పని చేసిన రవితేజ
  • రేపు విడుదల కానున్న రవితేజ చిత్రం 'క్రాక్'
  • ఈ చిత్రానికి దర్శకుడు గోపిచంద్ మలినేని
Raviteja tells that he may take direction responsibility

వెండి తెరపై ఒక వెలుగు వెలుగుతున్న హీరో రవితేజ ఒకప్పుడు దర్వకత్వ శాఖలో పని చేసిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎంతో కష్టపడి ఇప్పుడున్న స్థాయికి రవితేజ ఎదిగారు. హీరోగా టాప్ పొజిషన్ కి చేరిన రవితేజ మనసులో దర్శకత్వం వహించాలనే కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా తెలిపారు.

రవితేజ తాజా చిత్రం 'క్రాక్' రేపు విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ టీవీ చానల్ తో రవితేజ, డైరెక్టర్ గోపిచంద్ మలినేని ముచ్చటించారు. ఈ సందర్భంగా దర్శకత్వం చేసే అవకాశం ఉందా? అని ఛానల్ యాంకర్ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా 'ఉన్నాయ్... అవకాశాలున్నాయ్.. చూద్దాం' అని రవితేజ అన్నారు. సో... రానున్న రోజుల్లో ఎప్పుడో ఒకప్పుడు రవితేజ దర్శకత్వంలో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు.