మరో హిందీ సినిమాకి సంతకం చేసిన రకుల్ ప్రీత్ సింగ్

07-01-2021 Thu 21:47
  • తెలుగు, హిందీ సినిమాలలో రాణిస్తున్న రకుల్
  • ఇంద్రకుమార్ దర్శకత్వంలో తాజాగా 'థ్యాంక్ గాడ్'
  • హీరోలుగా అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ మల్హోత్రా
  • ఈ నెల 21 నుంచి షూటింగ్ నిర్వహణ  
Rakul signs for another Hindi film

ఓపక్క తెలుగులో పలు సినిమాలు చేస్తున్న కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్ మీద కూడా తన ముద్ర వేయడానికి ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే హిందీలో ఒక అరడజను సినిమాల వరకు చేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో చిత్రానికి సంతకం చేసింది. ఈ విషయాన్ని తనే తాజగా వెల్లడించింది.

ఈ చిత్రం పేరు 'థ్యాంక్ గాడ్'.. బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ ఇంద్రకుమార్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోలుగా నటిస్తారు. ఈ నెల 21 నుంచి ఈ 'థ్యాంక్ గాడ్' సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ విషయాల గురించి ట్వీట్ చేసిన రకుల్ మిగతా వివరాలు త్వరలో చెబుతానని పేర్కొంది.  

ఇదిలావుంచితే, ఇప్పుడీ చిత్రం చేయడం ద్వారా హీరోలు అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ మల్హోత్రాలతో రకుల్ చెరో మూడు సినిమాలు చేసిన కథానాయిక అవుతుంది. ఇప్పటికే అజయ్ తో 'దేదే ప్యార్ దే' సినిమా చేయగా, ప్రస్తుతం 'మేడే' సినిమాలో నటిస్తోంది. అలాగే, సిద్ధార్థ్ తో 'అయ్యారి', 'మార్జావాన్' సినిమాలలో రకుల్ నటించింది. మొత్తానికి ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో అవకాశాలు మాత్రం బాగానే అందుకుంటోంది.