Raja Singh: ఐదు రోజుల్లో అడ్డుకోకపోతే నేనే రంగంలోకి దిగుతా: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

Raja Singh sets deadline to Sajjanar

  • సజ్జనార్ కు రాజాసింగ్ మరోసారి సవాల్ 
  • గోవుల అక్రమ రవాణాలు అడ్డుకోవాలి
  • ఇప్పటికైనా చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలి

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. సజ్జనార్ కు రాజాసింగ్ మరోసారి సవాల్ విసిరారు. గోవుల అక్రమ తరలింపును వెంటనే అడ్డుకోవాలని... ఐదు రోజుల్లో అడ్డుకోకపోతే తానే రంగంలోకి దిగుతానని హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ పై తనకు గౌరవం ఉందని చెప్పారు. ఇప్పటికైనా చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులపై కామెంట్లు చేయడం కాదని... గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిని పట్టుకుని, చర్యలు తీసుకోవాలని అన్నారు. లేకపోతే... 'మీకు చేత కాకుంటే' అనే పదాన్ని తాను ఉపయోగించవచ్చని చెప్పారు.

Raja Singh
Sajjanar
BJP
  • Loading...

More Telugu News