barak obama: 'అమెరికా క్యాపిటల్ భవనంలో హింస' సిగ్గుప‌డాల్సిన విష‌యం: ఒబామా స్పంద‌న‌

obama slams trump

  • ఈ ఘటన అమెరికాకే అవమానకరం
  • చట్టబద్ధమైన ఎన్నికల ఫలితాలపై ట్రంప్ నిరాధార‌ ఆరోపణలు
  • అస‌త్యాలు చెబుతూ  మద్దతుదారులను ప్రేరేపించారు

అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ పార్టీ నేత‌ జో బైడెన్ ఎన్నికకు వ్యతిరేకంగా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్లి ఆందోళ‌న తెలిపిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా చోటు చేసుకున్న హింస‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. బైడెన్ గెలుపును ధ్రువీకరించేందుకు స‌మావేశమైన‌ కాంగ్రెస్ ను అడ్డుకునేలా ట్రంప్ మ‌ద్ద‌తుదారులు పాల్ప‌డ్డ తీరుపై మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా స్పందించారు. ఈ ఘటన అమెరికాకే అవమానకరమని, సిగ్గుపడే క్షణమని వ్యాఖ్యానించారు.

డొనాల్డ్ ట్రంప్‌ చట్టబద్ధమైన ఎన్నికల ఫలితాలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నార‌ని, అంతేగాక‌, అస‌త్యాలు చెబుతూ త‌న‌ మద్దతుదారులను ప్రేరేపించారని ఆయ‌న చెప్పారు. జో బైడెన్‌ సాధించిన విజయంపై రిపబ్లికన్‌ పార్టీతో పాటు దానికి మద్దతిచ్చే మీడియా నిజాలు చెప్పేందుకు సానుకూలంగా లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. కొన్ని రోజులుగా ఇటువంటి పరిణామాలే ఉన్నాయ‌ని చెప్పారు. ఆ తీరే ఇప్పుడు హింసాత్మకంగా మారింద‌ని తెలిపారు.

barak obama
Donald Trump
USA
  • Loading...

More Telugu News