సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

07-01-2021 Thu 07:22
  • కొత్త కారు కొనుగోలు చేసిన రష్మిక 
  • 'శాకుంతలం' కోసం భారీ సెట్స్
  • రానా దగ్గుబాటి 'అరణ్య' రిలీజ్ డేట్  
Rashmika buys a new car

*  తెలుగు, కన్నడ, హిందీ భాషలలో పలు చిత్రాలు చేస్తూ బిజీగా వున్న కథానాయిక రష్మిక తాజాగా కొత్త కారు కొనుక్కుంది. న్యూ ఇయర్ సందర్భంగా విలాసవంతమైన రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని షోషల్ మీడియా ద్వారా ఈ చిన్నది తెలియజేసింది.
*  ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో అందాలతార సమంత కథానాయికగా 'శాకుంతలం' పౌరాణికగాథ తెరకెక్కుతున్న సంగతి విదితమే. పాన్ ఇండియా మూవీగా రూపొందే ఈ చిత్రం కోసం ప్రస్తుతం దర్శకుడు గుణశేఖర్ భారీ సెట్స్ వేయిస్తున్నారు. మరోపక్క, ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.    
*  రానా దగ్గుబాటి నటించిన 'అరణ్య' చిత్రాన్ని మార్చి 26న దేశ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయడానికి నిర్ణయించారు. తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని హిందీలో 'హాథీ మేరే సాథీ' పేరిట విడుదల చేస్తారు.