ఇల్లు కొనే పనిలో బిగ్ బాస్ భామ

06-01-2021 Wed 18:52
  • బిగ్ బాస్ తో ప్రేక్షకులకు మరింత చేరువైన మోనల్
  • బిగ్ బాస్ తర్వాత మోనల్ కు పెరిగిన డిమాండ్
  • హైదరాబాదులో ఇల్లు కొనే పనిలో మోనల్
Monal to buy a house in Hyderabad

తెలుగు బిగ్ బాస్ సీజన్-4 దాదాపు 3 నెలల పాటు బుల్లి తెర ప్రేక్షకులను అలరించింది. ఈ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్లు అందరూ టైటిల్ గెలుచుకోవడం కోసం తమ వంతు కృషి చేస్తూ, ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచారు. ఈ సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లందరూ వారి టాలెంట్ ను నిరూపించుకుని, సినిమాల్లో సైతం ఛాన్సులు కొట్టేశారు. తాజాగా మరో ఆసక్తికర వార్త వినిపిస్తోంది.

ఈ సీజన్ లో ఫైనల్ కు చేరలేకపోయినా... ప్రేక్షకులకు మరింత చేరువైంది హీరోయిన్ మోనల్. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెకు డిమాండ్ కూడా పెరిగిపోయింది. సినిమాలు, వెబ్ సిరీస్ లు, టీవీ షోలలో ఆమెకు ఆఫర్లు వచ్చాయి. మరోవైపు ఆమె ఇల్లు కొనే పనిలో బిజీగా ఉందట. తనకు ఎంతో పాప్యులారిటీని ఇచ్చిన హైదరాబాదులోనే ఇల్లు కొనే పనిలో ఆమె ఉంది. ఇక్కడే సెటిల్ కావాలనే ఆలోచనలో ఆమె ఉన్నట్టు ఫిలింనగర్ టాక్.