నాకు ఇష్టం లేదని చెప్పినా.. నాతో బలవంతంగా ఆ సినిమా చేయించారు: నాని

06-01-2021 Wed 18:02
  • 'రైడ్' సినిమా చేయనని బెల్లంకొండ సురేశ్ కి చెప్పడానికి వెళ్లాను
  • వినకుండా ఆ సినిమా నాతో చేయించారు
  • ఆ సినిమా పెద్ద హిట్ అయింది
Nani interesting comments on Bellamkonda Suresh

అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన నాని... ఆ తర్వాత తెరంగేట్రం చేసి, టాలెంటెడ్ ఆర్టిస్టుగా తనను తాను నిరూపించుకున్నాడు. నేచురల్ స్టార్ గా అగ్రనటుల సరసన నిలిచాడు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన 'అల్లుడు అదుర్స్' సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేశ్ గతంలో తన మాట వినలేదని నాని అన్నాడు.

'రైడ్' సినిమా చేయనని చెప్పడానికి తాను బెల్లంకొండ సురేశ్ కార్యాలయానికి వెళ్లానని... తన మాట వినకుండా బలవంతంగా ఆ సినిమాను తనతో చేయించారని తెలిపాడు. ఆ తర్వాత ఆ సినిమా పెద్ద హిట్ అయిందని అన్నాడు. ఇప్పుడు 'అల్లుడు అదుర్స్' సినిమా ట్రైలర్ విడుదల చేయమని అడిగారని... ప్రసాద్ ల్యాబ్స్ లో షూటింగులో ఉంటానని చెప్పానని... అయినా వినకుండా ఈవెంట్ పెట్టి తనతో ట్రైలర్ రిలీజ్ చేయించారని తెలిపాడు. ట్రైలర్ అద్భుతంగా ఉందని... సినిమా సూపర్ హిట్ అవుతుందని అనిపిస్తోందని అన్నాడు.