Balakrishna: నోరు అదుపులో పెట్టుకో... మాటల మనుషులం కాదు, చేతలు కూడా చూపిస్తాం: బాలయ్య ఉగ్రరూపం

Balayya strong warning in Hindupur tour

  • పేకాట నేపథ్యంలో ఇటీవల వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని
  • హిందూపురం పర్యటనలో స్పందించిన బాలకృష్ణ
  • చట్టమంటే గౌరవంలేదని విమర్శలు
  • తమ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరిక

ఇటీవల తన నియోజకవర్గంలో పేకాటరాయుళ్లు అరెస్టయిన నేపథ్యంలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, పేకాట ఆడితే జరిమానా కట్టడమే కదా, అందుకే జరిమానాలు కట్టేసి మళ్లీ వచ్చి ఆడుతుంటారని వ్యాఖ్యానించారు. అంతేకాదు, టీడీపీ అధినాయకత్వాన్ని ఉద్దేశించి కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో, హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ స్పందించారు.

న్యాయం, చట్టంపై ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ శ్రేణులను రెచ్చగొడితే తీవ్రస్థాయిలో పరిణామాలు ఉంటాయని అన్నారు. నోరు అదుపులో పెట్టుకో... మేం మాటల మనుషులం కాదు, అవసరమైతే చేతలు కూడా చూపిస్తాం అని హెచ్చరించారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని బాలయ్య స్పష్టం చేశారు. ఆయన ఇవాళ తన నియోజకవర్గంలో పర్యటించారు. పలు గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News