Puvvada Ajay Kumar: ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు సైకిల్ పై ఇంటింటికీ తిరిగిన తెలంగాణ మంత్రి పువ్వాడ

Telangana minister Puvvada cycle tour in Khammam
  • వినూత్న కార్యక్రమం చేపట్టిన మంత్రి పువ్వాడ
  • ఖమ్మంలో సైకిల్ పర్యటన
  • సమస్యలు చెప్పాలంటూ ప్రజల్ని కోరిన వైనం
  • ఖమ్మం కార్పొరేషన్ కు మరిన్ని హంగులు తీసుకొస్తామని హామీ
తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఖమ్మంలో సైకిల్ పై ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలుంటే నిర్భయంగా చెప్పాలంటూ ప్రజలను ప్రోత్సహించారు. పాదచారులను కూడా ఆపి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కలెక్టర్, మేయర్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్లలో హైదరాబాద్ తర్వాతి స్థానం ఖమ్మందేనని తెలిపారు. సాక్షాత్తు కేటీఆర్ కూడా ఇదే చెప్పారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఖమ్మం కార్పొరేషన్ కు మరిన్ని సొబగులు అద్దే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి వివరించారు.
Puvvada Ajay Kumar
Cycle Tour
Khammam
TRS
Telangana

More Telugu News