Bhuma Akhila Priya: బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ అరెస్ట్!

Bhuma Akhilapriya Arrested by Hyderabad Police

  • కూకట్ పల్లి లోథా అపార్ట్ మెంట్స్ లో అరెస్ట్
  • ఆమె వాహనంలోనే పీఎస్ కు తరలింపు
  • విచారణ తరువాత కోర్టు ముందుకు

బోయిన్ పల్లిలో జరిగిన ముగ్గురు వ్యక్తుల కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత భూమా అఖిలప్రియను కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్ పల్లిలోని లోథా అపార్ట్ మెంట్స్ సమీపంలో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె వాహనంలోనే పోలీసు స్టేషన్ కు తరలించారు. నార్త్ జోన్ మహిళా ఇన్ స్పెక్టర్ ఆధ్వర్యంలో అఖిల ప్రియను అరెస్ట్ చేశారు. బోయిన్ పల్లి మహిళా పోలీసు స్టేషన్ లో ఆమెను విచారించి, ఆపై కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. అఖిల ప్రియ అరెస్ట్ పై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

Bhuma Akhila Priya
Kukatpalli
Police
Arrest
Bhargav Ram
  • Loading...

More Telugu News