సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

06-01-2021 Wed 07:30
  • ఫ్లాట్ కొనుగోలు చేసిన జాన్వీ కపూర్  
  • కాస్త ముందుగానే వస్తున్న రవితేజ 'క్రాక్'
  • డబ్బింగ్ మొదలెట్టిన 'టక్ జగదీశ్'
  • సల్మాన్ ఖాన్ చిత్రానికి భారీ డీల్    
Jahny Kapoor buys a flat in posh area of Mumbai

*  బాలీవుడ్ యంగ్ హీరోయిన్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ముంబైలో సొంతంగా ఓ ఫ్లాట్ కొనుగోలు చేసింది. నగరంలోని ఖరీదైన ప్రాంతమైన జుహు విలే పార్లేలో రూ.39 కోట్లతో ఆమె ఆ ఇంటిని కొన్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. కాగా, జాన్వీ ఇప్పటి వరకు మూడు సినిమాలలో నటించినప్పటికీ, హిట్ మాత్రం ఇంకా పడలేదని చెప్పాలి.
*  రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన 'క్రాక్' చిత్రాన్ని సంక్రాంతికి కాస్త ముందుగా.. ఈ నెల 9న విడుదల చేస్తున్నారు. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటించగా, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది.  
*  నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం 'టక్ జగదీశ్'. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఐశ్వర్య రాజేశ్, రీతూ వర్మ ఇందులో కథానాయికలుగా నటించారు.
*  బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కథానాయకుడుగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతున్న 'రాధే' చిత్రానికి సంబంధించి భారీ డీల్ జరిగింది. ఈ చిత్రం థియేటిరికల్, శాటిలైట్, డిజిటల్, ఓవర్సీస్, మ్యూజిక్.. హక్కులన్నీ కలిపి 230 కోట్లకు జీ స్టూడియోస్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.