Madhavan: హీరో మాధవన్ డ్రగ్స్ కారణంగా ఎలా అయిపోయాడో చూడండన్న లేడీ డాక్టర్... మీరోసారి డాక్టర్ కు చూపించుకోవాలని మాధవన్ కౌంటర్

Hero Madhavan counters a lady doctor

  • మాధవన్ డ్రగ్స్ తో నాశనం అయ్యాడన్న వైద్యురాలు
  • అతడి ముఖం చూస్తేనే అర్థమవుతుందని వ్యాఖ్యలు
  • ఒకప్పుడు తన మానసచోరుడు అని వెల్లడి
  • మీ పేషెంట్లను తలుచుకుంటే భయం వేస్తోందన్న మ్యాడీ

ఒక భాషకు పరిమితం కాకుండా అటు బాలీవుడ్ లోనూ, ఇటు దక్షిణాది సినిమాల్లోనూ నటిస్తూ పాన్ ఇండియా ఇమేజ్ అందుకున్న నటుడు మాధవన్. ఈ స్మైలీ హీరోకి మహిళా అభిమానులు చాలా ఎక్కువ. అయితే, అనూషా భండార్కర్ అనే వైద్యురాలు ట్విట్టర్ లో మాధవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. డ్రగ్స్ వాడుతూ తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడని ఆరోపించింది.

"మ్యాడీ ఒకప్పుడు నా మానసచోరుడు. కానీ ఇప్పుడు మాధవన్ ను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. మాధవన్ తన అద్భుతమైన కెరీర్ ను, ఆరోగ్యాన్ని, జీవితాన్ని మద్యం, మాదకద్రవ్యాలతో నాశనం చేసుకుంటున్నాడు. బాలీవుడ్ లో ఎంతో తాజాగా అడుగుపెట్టిన మాధవన్ కు, ఇప్పటి మాధవన్ కు పోలికే లేదు. ఓసారి మాధవన్ ను చూడండి... అతనెలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో అతని ముఖం, కళ్లను చూస్తే అర్థమవుతుంది!" అని అనూషా భండార్కర్ వివరించింది.

దీనిపై మాధవన్ ఘాటుగా స్పందించాడు. "మీరు చేసే రోగనిర్ధారణ ఇలా వుంటుందన్నమాట.. మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తోంది... మీ పేషెంట్లను ఆ దేవుడే కాపాడాలి. నాకు తెలిసినంతవరకు మీరొక డాక్టర్ ను సంప్రదించడం మంచిది" అంటూ బదులిచ్చారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News