Pawan Kalyan: చిన్నజీయర్ స్వామి వారు చెప్పిన ఈ మహా వాక్యం సర్వమతాల వారికి ఆచరణీయం: పవన్ కల్యాణ్

Pawan Kalyan reiterates Chinna Jeeyar sayings

  • ఇటీవల చిన్నజీయర్ తో పవన్ భేటీ
  • స్వామివారి ప్రవచనాన్ని అందరితో పంచుకున్న పవన్
  • స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ అంటూ జీయర్ ఉద్బోధ
  • మహావాక్యం అంటూ కొనియాడిన పవన్

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి చిన్నజీయర్ స్వామితో భేటీ అయ్యారు. చిన్నజీయర్ తో సమావేశం నేపథ్యంలో తాజాగా తన మనోభావాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. "నీ మతాన్ని ఆరాధించు... ఎదుటి మతాన్ని గౌరవించు" అంటూ జీయర్ స్వామి చెప్పిన వాక్యాన్ని పవన్ కల్యాణ్ ఉదాహరించారు.

"గతంలో లౌకిక వాదంపై నేను మాట్లాడిన మాటలను ఇప్పటి పరిస్థితుల్లో మళ్లీ ప్రస్తావించాలని భావించినప్పుడు మొన్న గుంటూరులో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ జీయర్ స్వామి వారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి" అని తెలిపారు.

"స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ (Worship your own... Respect all)" అని క్లుప్తంగా జ్ఞానబోధ చేశారని వివరించారు. "హిందూ దేవతా ఆరాధనలో ఏ లోటు జరగకూడదు, అదే సమయంలో ఇతర మతాల పట్ల ఆదరణ, గౌరవం తగ్గకూడదు. స్వామివారు చెప్పిన ఈ మహావాక్యం సర్వమతాల వారికి ఆచరణీయం" అని పేర్కొన్నారు.

Pawan Kalyan
Chinna Jeeyar Swamy
Janasena
Andhra Pradesh
  • Loading...

More Telugu News