అల్లు అర్జున్ 'పుష్ప'లో సాయిపల్లవి?

05-01-2021 Tue 16:22
  • సుకుమార్ దర్శకత్వంలో బన్నీ 'పుష్ప'
  • అల్లు అర్జున్ సరసన నాయికగా రష్మిక
  • హీరో చెల్లి పాత్రలో సాయి పల్లవి?
  • 8 నుంచి మరో షెడ్యూలు షూటింగ్    
Sai Pallavi in an important role in Pushpa

సాయిపల్లవి ఒక సినిమా ఒప్పుకునే ముందు చాలా ఆలోచిస్తుంది. తన పాత్ర నచ్చకపోతే ఏమాత్రం మొహమాటం లేకుండా నో చెప్పేస్తుంది. అందుకే, ఆమెను ఒక సినిమాలో బుక్ చేయడం అంత ఈజీ కాదు. అలాంటి సాయిపల్లవి తాజగా అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాలో ఓ కీలక పాత్ర చేయడానికి ఒప్పుకుందంటూ టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక హీరో హీరోయిన్లుగా 'పుష్ప' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఒక షెడ్యూలు ఆమధ్య మారేడుమిల్లి అడవుల్లో జరిగింది. తదుపరి షెడ్యూలును ఈ నెల 8 నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పుడీ చిత్రంలోనే సాయిపల్లవి నటించడానికి ఓకే చెప్పిందని అంటున్నారు. పైగా, ఈ చిత్రంలో ఆమె హీరోకి చెల్లిగా నటిస్తుందని, ఇది చాలా కీలక పాత్ర అనీ ప్రచారం జరుగుతోంది. మరి, ఓపక్క ఇతర సినిమాలలో కథానాయికగా నటిస్తున్న సాయిపల్లవి.. ఇలా హీరోకి చెల్లిగా నటిస్తుందా? ఆ పాత్రలో అంత విషయం వుందా? అన్నది త్వరలో వెల్లడవుతుంది.