Ganguly: రాజకీయాల్లో చేరాలంటూ వస్తున్న ఒత్తిళ్లు గంగూలీ ఆరోగ్యాన్ని దెబ్బతీసి ఉండొచ్చు: సీపీఎం నేత అశోక్ భట్టాచార్య

Ganguly friend says he believes that pressure to join politics can have an impact on health

  • గుండెపోటుతో ఆసుపత్రిపాలైన గంగూలీ
  • యాంజియోప్లాస్టీ నిర్వహించిన కోల్ కతా వైద్యులు
  • ప్రస్తుతం కోలుకుంటున్న దాదా
  • ఆసుపత్రిలో గంగూలీని పరామర్శించిన స్నేహితుడు భట్టాచార్య

బీసీసీఐ అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గుండెపోటుకు గురై ఆసుపత్రిపాలైన సంగతి తెలిసిందే. కోల్ కతా వైద్యులు ఆయనకు యాంజియోప్లాస్టీ కూడా నిర్వహించారు. అయితే, గంగూలీ అస్వస్థతకు ఒత్తిళ్లు కారణమై ఉండొచ్చని ఆయన స్నేహితుడు, సీపీఎం నేత అశోక్ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. కోల్ కతాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గంగూలీని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

రాజకీయాల్లో చేరాలంటూ గంగూలీపై ఒత్తిళ్లు వస్తున్నాయని, కొందరు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం గంగూలీని వాడుకోవాలని చూస్తున్నారని భట్టాచార్య ఆరోపించారు. బహుశా, ఈ ఒత్తిళ్లే గంగూలీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపి ఉంటాయని అన్నారు. గంగూలీ ఓ క్రికెటర్ గా ఎంతో పేరు తెచ్చుకున్నారని, క్రికెట్ రంగంలో ఓ దిగ్గజం అని వెల్లడించారు. అయితే, తనకు తెలిసిన గంగూలీకి రాజకీయాలు సరిపడవని భట్టాచార్య స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వెళ్లొద్దని గంగూలీకి కిందటి వారమే చెప్పానని, తన అభిప్రాయాన్ని ఆయన సానుకూల ధోరణిలో విన్నారని తెలిపారు. రాజకీయాల్లో చేరాలని గంగూలీపై ఒత్తిడి చేయడం తగదని హితవు పలికారు.

  • Loading...

More Telugu News