'ఆర్ఆర్ఆర్' నుంచి చిరు వాయిస్ తో ఈ నెల‌ 26న టీజ‌ర్ విడుద‌ల‌?

05-01-2021 Tue 13:23
  • ఇప్ప‌టికే రెండు టీజ‌ర్లు విడుద‌ల‌
  • ఈ నెల 26న రిప‌బ్లిక్ డే
  • దేశ భ‌క్తి అంశాల నేప‌థ్యంలో రూపుద్దికుంటోన్న సినిమా
  • మ‌రో టీజ‌ర్ కోసం స‌న్నాహాలు?
one more teaser from rrr on 26th

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌-రామ్‌ చరణ్‌ కథానాయకులుగా రూపుదిద్దుకుంటోన్న‌ భారీ బడ్జెట్‌ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ కోసం ప్రేక్ష‌కులు ఎంత‌గా ఎదురుచూస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రంలేదు.‌ కొమరం భీంగా తారక్‌‌, అల్లూరి సీతారామరాజుగా చెర్రీ న‌టిస్తోన్న ఈ సినిమాకు సంబంధించి ఈ ఇద్ద‌రిపై ఫ‌స్ట్ లుక్ లు, టీజ‌ర్ లు ఇప్ప‌టికే విడుద‌ల‌య్యాయి.

ఈ క్రమంలో ఈ సినిమా నుంచి ప్రేక్ష‌కుల‌కు మ‌రో సర్ ప్రైజ్ రానున్న‌ట్లు తెలుస్తోంది. ఈ  నెల 26న రిప‌బ్లిక్ డే ఉండ‌డం, ఈ సినిమా కూడా దేశ భ‌క్తి అంశాల నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటుండడంతో ఆర్ఆర్ఆర్ నుంచి మరో ప్రత్యేక వీడియోను విడుదల చేస్తార‌ని స‌మాచారం. అంతేకాదు, ఈ వీడియోకు చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తున్నార‌ని తెలుస్తోంది.