మూగ‌జీవాల‌ను ఇలా హింసించొద్దు: యాంక‌ర్ ర‌ష్మీ

05-01-2021 Tue 10:44
  • ఓ ఏనుగు ఫొటోల‌ను షేర్ చేసిన ర‌ష్మీ
  • స‌ర‌దా కోసం ఏనుగుపై ఎక్కుతామ‌న్న యాంక‌ర్
  • దానిపై తిర‌గ‌డం వ‌ల్ల దానికి హాని జ‌రుగుతుందని వ్యాఖ్య‌
  • దాన్ని బాధ పెట్ట‌డం స‌రికాద‌ని ఆవేద‌న‌
 rashmigautam says Be the change you want to see

మూగ‌జీవాల‌ను హింసించ‌వ‌ద్ద‌ని యాంక‌ర్ ర‌ష్మీ త‌రుచూ పోస్టులు చేస్తుంటుంది. తాజాగా, ఓ ఏనుగు ఫొటోల‌ను షేర్ చేసిన ఆమె దాన్ని హింసించ‌డం స‌రికాద‌ని చెప్పింది.  మ‌నం స‌ర‌దా కోసం ఏనుగుపై ఎక్కి దానిపై తిర‌గ‌డం వ‌ల్ల దానికి హాని జ‌రుగుతుంద‌ని ర‌ష్మీ చెప్పింది. మ‌న స‌ర‌దా కోసం దాన్ని బాధ పెట్ట‌డం స‌రికాద‌ని పేర్కొంది.

స‌మాజంలో మ‌నం కోరుకునే మార్పు మ‌న నుంచే ప్రారంభం కావాల‌ని ఆమె చెప్పింది. ఏనుగుపై ఎక్కి తిర‌గ‌డం వ‌ల్ల దానికి ఎలా గాయాల‌వుతాయ‌న్న విష‌యాన్ని వివ‌రిస్తూ ఆమె ఫొటో పోస్ట్ చేసింది. ఏనుగు త‌న మాట విన‌డానికి మావ‌టివాడు దాన్ని గాయ‌ప‌ర్చుతాడ‌ని వివ‌రించింది. ఓ ఏనుగుకి అయిన గాయాల‌ను ఆమె ఫొటో చూపించింది. మావ‌టివాడు ఏనుగును ఎటువంటి ప‌దునైన‌ ఆయుధంతో నియంత్ర‌ణ‌లోకి తెస్తాడో కూడా చెప్పింది.