BJP: బీజేపీ ‘రామతీర్థ ధర్మయాత్ర’.. ఎక్కడికక్కడ నేతల గృహనిర్బంధం

AP BJP leader House Arrest

  • కోదండరాముడి విగ్రహ ధ్వంసంపై బీజేపీ ఆగ్రహం
  • బీజేపీ నేతల హౌస్ అరెస్ట్‌లపై కన్నా ఆగ్రహం
  • రాష్ట్రంలో ఫ్యాక్షనిస్టు పాలన కొనసాగుతోందని మండిపాటు

ఏపీలో విగ్రహాలపై దాడులకు నిరసనగా బీజేపీ చేపట్టిన రామతీర్థ ధర్మయాత్రపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ యాత్రలో పాల్గొనకుండా బీజేపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. రామతీర్థంలో కోదండరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన బీజేపీ, జనసేన కలిసి నేడు రామతీర్థ ధర్మయాత్ర చేపట్టనున్నట్టు ప్రకటించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ధర్మయాత్రకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న నేతలను ముందస్తుగా గృహనిర్బంధం చేశారు.

కన్నా లక్ష్మీనారాయణను గుంటూరులోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేయగా, పార్వతీపురంలో బీజేపీ నేత ఉమామహేశ్వరరావును హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే, మరో 25 మంది బీజేపీ నేతలకు ముందస్తు నోటీసులు ఇచ్చి నిర్బంధించారు. తనను హౌస్ అరెస్ట్ చేయడంపై కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఫ్యాక్షనిస్టు పాలన కొనసాగుతోందని, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

BJP
Vizianagaram
Ramatheertham Temple
Kanna Lakshminarayana
House arrest
  • Loading...

More Telugu News