India: యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లోకి భారత్ కు స్వాగతం: అమెరికా

USA Welcomes India in UN Security Council

  • కొత్త సంవత్సరం మరిన్ని అవకాశాలు తెచ్చింది
  • ఇండియాతో బలమైన సంబంధాలను కోరుకుంటున్నాం
  • ట్వీట్ చేసిన అమెరికా విదేశాంగ శాఖ

"యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లోకి ఇండియాకు స్వాగతం. ఓ కొత్త సంవత్సరం మరిన్ని కొత్త అవకాశాలను తీసుకుని వచ్చింది. పాత స్నేహితులు, భాగస్వాములతో మరింత బలమైన సంబంధాలను కోరుకుంటున్నాం" అంటూ సెక్యూరిటీ కౌన్సిల్ లోకి ఇండియాకు అమెరికా స్వాగతం పలికింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ఓ ట్వీట్ చేసింది. ఇండో-పసిఫిక్ రీజియన్ ను మరింత భద్రంగా మార్చేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని బ్యూరో ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఏసియన్ అఫైర్స్ విభాగం వ్యాఖ్యానించింది. ఇండియాతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని పేర్కొంది.

కాగా, సోమవారం నాడు భారత జాతీయ పతాకాన్ని యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ (యూఎన్ఎస్సీ)లో సభ్య దేశాల సరసన నిలిపారు. 2021-22 సంవత్సరానికిగాను తాత్కాలిక సభ్య దేశంలో యూఎన్ బాడీలో ఇండియా స్థానాన్ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇండియా ఇలా యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో తాత్కాలిక సభ్య దేశంగా ఎంపిక కావడం ఇది ఎనిమిదవ సారి కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News