సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

05-01-2021 Tue 07:21
  • కామెడీ పాత్రలు కావాలంటున్న నివేద 
  • కల్యాణ్ రామ్ మలయాళం రీమేక్
  • 'కిసాన్' సినిమాలో హీరోగా సోనూ సూద్  
Niveda Peturaj says she is fond of comedy roles

*  తనకు కామెడీ పాత్రలంటే చాలా ఇష్టమని అంటోంది కథానాయిక నివేద పేతురాజ్. "అవును, నాకు కామెడీ అంటే చాలా ఇష్టం.. అలాంటి పాత్రలు చేయాలని ఉంటుంది. అయితే, నాకు వస్తున్నవన్నీ సీరియస్ పాత్రలే. అవి కూడా ఎక్కువగా హోమ్లీ పాత్రలే వస్తున్నాయి" అని చెప్పింది నివేద.
*  నందమూరి కల్యాణ్ రామ్ తన తదుపరి చిత్రంగా ఓ మలయాళ రీమేక్ ను చేయనున్నాడు. 'అంజామ్ పథిరా' అనే మలయాళం చిత్రాన్ని రీమేక్ చేసే ఉద్దేశంలో కల్యాణ్ రామ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతకుముందు కల్యాణ్ రామ్ తో '118' చిత్రాన్ని చేసిన దర్శకుడు గుహన్ దీనికి దర్శకత్వం వహిస్తాడట.
*  రైతుల సమస్యలపై రూపొందే 'కిసాన్' సినిమాలో ప్రముఖ నటుడు సోనూ సూద్ హీరోగా నటించనున్నాడు. ఇందులో ఆయన రైతు పాత్రను పోషిస్తాడు. ఇ.నివాస్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు రాజ్ శాండిల్య నిర్మిస్తారు.