Vishnu Vardhan Reddy: ఇవే దాడులు చర్చిలపై జరిగి ఉంటే వెంటనే జైలుకు పంపేవారు: విష్ణువర్ధన్ రెడ్డి

Vishnu Vardhan Reddy criticises YSRCP
  • ఆలయాలపై దాడులు నిత్యకృత్యంగా మారాయి
  • దేవాలయాల్లోకి అన్యమతస్థులు వచ్చి ప్రార్థనలు చేస్తున్నారు
  • హోంమంత్రి ఉన్నారా అనే అనుమానం కలుగుతోంది
ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు జరగడం నిత్యకృత్యంగా మారిందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఇన్ని దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని అన్నారు. ఇవే దాడులు చర్చిలపై జరిగి ఉంటే నిందితులను వెంటనే జైలుకు పంపేవారని చెప్పారు. దేవాలయాల్లోకి అన్యమతస్థులు వచ్చి ప్రార్థనలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

అసలు రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారా? అనే అనుమానం కలుగుతోందని అన్నారు. వైసీపీ వారే విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారని... కానీ ఫిర్యాదులు మాత్రం చేయడం లేదని విమర్శించారు. సీపీఐ నారాయణ ఒక పార్టీకి దళారీగా మారారని దుయ్యబట్టారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.
Vishnu Vardhan Reddy
BJP
Andhra Pradesh
Temples

More Telugu News