30 రోజుల్లో బరువు తగ్గే ఛాలెంజ్ ని ప్రారంభించిన విజయ్ దేవరకొండ

04-01-2021 Mon 19:27
  • జూబ్లీహిల్స్ లోని జిమ్ లో ఛాలెంజ్ ను ప్రారంభించిన విజయ్
  • ఇప్పుడిప్పుడే జిమ్ కు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని వ్యాఖ్య
  • ఫిట్నెస్ విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారని ప్రశంస
Vijay Devarakonda starts weight reduction challenge

యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండకు ఉన్న ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. వరుస విజయాలతో దూసుకుపోయిన దేవరకొండ.. 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోర్లా పడటంతో కాస్త నెమ్మదించాడు. ఇప్పుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఫైటర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా 30 రోజుల్లో బరువు తగ్గే ఛాలెంజ్ ను విజయ్ ప్రారంభించాడు. జూబ్లీహిల్స్ లోని జిమ్ లో ఈ ఫిట్నెస్ కార్యక్రమాన్ని ప్రారంభించాడు.

ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ, తాను గత మూడు సంవత్సరాలుగా ఈ జిమ్ కు వస్తున్నానని చెప్పాడు. కరోనాకు ముందు ఎంతో మంది జిమ్ కు వచ్చేవారని.. ఇప్పుడిప్పుడే మళ్లీ జిమ్ కు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని తెలిపాడు. ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు.