ఫేవ‌రెటిజం వల్ల నేను కొన్ని అవకాశాలను కోల్పోయాను: అనసూయ

04-01-2021 Mon 19:06
  • ఇండస్ట్రీలో తెలియని ఫేవరెటిజం ఉంది
  • షూటింగ్  ప్యాకప్ అయిన తర్వాత నెట్ వర్కింగ్ చాలా ముఖ్యం
  • నచ్చిన వారికే అవకాశాలు ఇస్తారు
I lost few chances due to favoritism says actor Anasuya

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బిజీగా ఉన్న యాక్టర్లలో అనసూయ ఒకరు. ఓ వైపు టీవీ షోలతో సందడి చేస్తూనే, మరో వైపు వరుస సినీ అవకాశాలతో దూసుకుపోతోంది. అందంతో పాటు అభినయం కూడా ఉండటంతో వరుస అవకాశాలు ఆమె తలుపు తడుతున్నాయి. తాజాగా సినీ పరిశ్రమ గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇండస్ట్రీలో నెపోటిజంతో పాటు ఫేవరెటిజం కూడా ఉంటుందని ఆమె అన్నారు. తెలియని ఫేవరెటిజం ఇండస్ట్రీలో ఉందని తెలిపారు. షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత చేసే నెట్ వర్కింగ్ చాలా ముఖ్యమని... ఈ నెట్ వర్కింగ్ ఫేవరెటిజంకు కారణమవుతుందని చెప్పారు. దీంతో, తమకు నచ్చిన వారికే అవకాశాలు ఇస్తారని అన్నారు. ఫేవరెటిజం వల్ల తాను కూడా కొన్ని అవకాశాలను కోల్పోయానని చెప్పారు.