Renu Deshai: మహేశ్ బాబు సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్ర!

Renu Deshai plays key role in Mahesh Babus movie
  • మహేశ్ తాజా చిత్రం 'సర్కారు వారి పాట'
  • బ్యాంకు స్కాముల నేపథ్యంలో సాగే కథ
  • మహేశ్ సరసన నాయికగా కీర్తి సురేశ్
  • హీరోకి వదిన పాత్రలో రేణు దేశాయ్  
గతంలో కొన్ని తెలుగు సినిమాలలో కథానాయికగా నటించిన ప్రముఖ నటి రేణు దేశాయ్ తాజాగా మళ్లీ ఓ తెలుగు సినిమాలో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులోనూ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించే సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించనుందంటూ టాలీవుడ్ లో ఇప్పుడు ప్రచారం జరుగుతోంది.

పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా 'సర్కారు వారి పాట' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోనే రేణు దేశాయ్ కీలక పాత్ర పోషించనుందనీ, మహేశ్ కి వదిన పాత్రలో ఆమె కనిపిస్తుందని తెలుస్తోంది. ఈ విషయంలో రేణుతో ప్రస్తుతం దర్శక నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నారట. ఈ విషయంలో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుంది.

బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో ఈ 'సర్కారు వారి పాట' చిత్రం తెరకెక్కనుంది. ఇందుకోసం హైదరాబాదులో బ్యాంకు సెట్ కూడా వేస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి ఇక్కడ తొలి షెడ్యూలును నిర్వహిస్తారని అంటున్నారు. ఈ షెడ్యూలు పూర్తయిన పిదప అమెరికాలో మరో భారీ షెడ్యూలు షూటింగ్ జరుగుతుంది. అందుకోసం ఇప్పటికే అక్కడ లొకేషన్ల ఎంపిక పూర్తయింది. ఈ చిత్రంలో మహేశ్ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది.    
Renu Deshai
Mahesh Babu
Keerti Suresh

More Telugu News