ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్?

04-01-2021 Mon 12:49
  • 'ఆర్ఆర్ఆర్' తర్వాత త్రివిక్రమ్ తో ఎన్టీఆర్
  • ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి
  • ఎన్టీఆర్ సరసన ముగ్గురు హీరోయిన్లు
  • ఏప్రిల్ నుంచి షూటింగ్ నిర్వహణ    
Jahnvi Kapoor opposite NTR

'అరవింద సమేత' తర్వాత ఎన్టీఆర్ ఇప్పుడు మళ్లీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని చేస్తున్న ఎన్టీఆర్ అది పూర్తవగానే త్రివిక్రమ్ చిత్రాన్ని ప్రారంభిస్తారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చాలావరకు పూర్తయ్యాయి.

ఈ చిత్రంలో కథ విస్తృతిని బట్టి మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే ఓ హీరోయిన్ గా రష్మికను దాదాపు ఎంపిక చేసినట్టు  వార్తలొస్తున్నాయి. మరో కథానాయికగా శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ ని తీసుకుంటున్నట్టు, ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. మూడో కథానాయిక విషయంలో ఇంకా క్లారిటీ రావలసివుంది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మితం అయ్యే ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రూపొందనుంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, కన్నడ నటుడు ఉపేంద్ర, మలయాళ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తారని అంటున్నారు. దీనికి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ని వర్కింగ్ టైటిల్ గా పరిగణిస్తున్నారు. ఏప్రిల్ నుంచి షూటింగును నిరవధికంగా నిర్వహించడానైకి ప్లాన్ చేస్తున్నారు. నేటి బిజీ సంగీత దర్శకుడు తమన్ దీనికి సంగీతాన్ని అందిస్తాడు.