సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

04-01-2021 Mon 07:27
  • 'లూసిఫర్' రీమేక్ లో నయనతార 
  • మళ్లీ మారేడుమిల్లి అడవులకు 'పుష్ప' 
  • వెబ్ సీరీస్ చేయనున్న వెన్నెల కిశోర్ 
  • పదేళ్ల నాటి హిట్ చిత్రానికి సీక్వెల్  
Nayanatara plays female lead in Chiranjeevis Lucifer

*  మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రంలో కథానాయికగా నయనతార నటిస్తుందని తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది.
*  అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగ్ ఈ నెల 8 నుంచి తిరిగి మారేడుమిల్లి అడవుల్లో నిర్వహిస్తారు. గత నెలలో అక్కడ ఓ షెడ్యూలు జరుగుతుండగా, యూనిట్ లో కొందరికి కరోనా సోకడంతో అర్థాంతరంగా షూటింగును నిలిపివేసి, చిత్ర బృందం హైదరాబాదుకి తిరిగొచ్చిన సంగతి విదితమే.
*  ప్రముఖ హాస్య నటుడు వెన్నెల కిశోర్ ఓ వెబ్ సీరీస్ లో నటించనున్నాడు. 'విరాటపర్వం' దర్శకుడు వేణు ఉడుగుల 'ఆహా' ఓటీటీ కోసం ఓ వెబ్ సీరీస్ నిర్మిస్తున్నారు. ఇందులో మెయిన్ లీడ్ ను వెన్నెల కిశోర్ పోషించనున్నాడు.
*  పదేళ్ల క్రితం సెల్వరాఘవన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వచ్చిన 'యుగానికి ఒక్కడు' (తమిళంలో ఆయిరత్తిల్ ఒరువన్) హిట్ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ చేస్తున్నారు. అయితే, ఇప్పుడీ సీక్వెల్ లో కార్తీ బదులు ధనుశ్ హీరోగా నటించనున్నాడు. ఇదో భారీ చిత్రమని, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని దర్శకుడు సెల్వ రాఘవన్ చెప్పారు.