Crow: మూడు రోజులుగా చచ్చిపడుతున్న కాకులు.. మధ్యప్రదేశ్‌లో బర్డ్‌ఫ్లూ కలకలం

Bird flu virus detected in dead crows in Indore

  • ఇండోర్ కాలేజీలో 83 కాకులు మృత్యువాత
  • భోపాల్ ప్రయోగశాలకు నమూనాలు
  • హెచ్5ఎన్8 ఎవియన్ ఇన్‌ప్లుయెంజా కారణమంటున్న అధికారులు

కరోనా వైరస్ భయం నుంచి ఇంకా కోలుకోముందే మధ్యప్రదేశ్‌లో బర్డ్‌ఫ్లూ కలకలం రేగింది. ఇండోర్‌లో గత మూడు రోజులుగా పదుల సంఖ్యలో కాకులు చచ్చిపడుతుండడంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన ఇండోర్ మున్సిపల్ అధికారులు, వెటర్నరీ విభాగం అధికారులు వాటి నమూనాలు సేకరించి పరీక్షల కోసం భోపాల్‌లోని ప్రయోగశాలకు పంపారు.

కాకుల మృతికి హెచ్5ఎన్8 ఎవియన్ ఇన్‌ప్లుయెంజా కారణమని అధికారులు చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమని, పక్షుల్లో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ఇండోర్‌లోని డాలీ కాలేజీ క్యాంపస్‌లో ఇప్పటి వరకు 83 కాకులు మృతి చెందినట్టు పేర్కొన్నారు. ఇండోర్‌లోని జూపార్క్ వైద్యుడు ఉత్తమ్ యాదవ్ మాట్లాడుతూ మృతి చెందిన కాకుల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News