Krish: దర్శకుడు క్రిష్ కి కరోనా పాజిటివ్.. పవన్ సినిమా షూటింగ్ వాయిదా

 Director Krish tested corona positive

  • ఈ నెల 4 నుంచి క్రిష్ దర్శకత్వంలో పవన్ సినిమా
  • షూటింగ్ ముంగిట కరోనా పరీక్షలు చేయించుకున్న క్రిష్
  • పాజిటివ్ రావడంతో హోం క్వారంటైన్
  • ఏఎం రత్నం నిర్మిస్తున్న పీరియాడికల్ మూవీ  

సినీ రంగంలోనూ కరోనా వైరస్ భూతం కలకలం రేపుతోంది. తాజాగా ప్రముఖ దర్శకుడు క్రిష్ కరోనా బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. తాను హోం క్వారంటైన్ లో ఉన్నట్టు తెలిపారు. క్రిష్... పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో సినిమా చేయాల్సి ఉండడంతో షూటింగ్ కు వెళ్లే ముందు ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్ రావడంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది.

వాస్తవానికి ఈ నెల 4 నుంచి చిత్రీకరణ షురూ చేయాలని చిత్రబృందం భావించింది. ఇటీవలే వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసుకున్న పవన్... క్రిష్ తో సినిమా కోసం సన్నద్ధమయ్యారు. ఇంతలో క్రిష్ కరోనా బారినపడడంతో షూటింగ్ మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతుందన్నది తెలియాల్సి ఉంది.

ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం ఓ పీరియాడికల్ మూవీ అని తెలుస్తోంది. విరూపాక్ష అనే టైటిల్ పరిశీలనలో ఉంది. పవన్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం అని ప్రచారం జరుగుతోంది.

Krish
Corona Virus
Positive
Pawan Kalyan
Tollywood
  • Loading...

More Telugu News